ప్రకాశం: దర్శి పట్టణంలో ఉన్నటువంటి కోర్టు ప్రాంగణంలో శనివారం జాతీయ మెగా లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ లోక్ అదాలత్ కార్యక్రమంలో ముండ్లమూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 28 కేసులు పరిష్కారం అయ్యాయని ఎస్సై నాగరాజు శనివారం తెలిపారు. లోక్ అదాలత్లో కేసులకు శాశ్వత పరిష్కారం వస్తుందని ఎస్ఐ అన్నారు.