కోనసీమ: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా వాడపాలెం ఎమ్మెల్యే కార్యాలయంలో శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహించారు. కొత్తపేట MLA బండారు సత్యానందరావు ప్రజల నుంచి 35 అర్జీలను స్వీకరించి, పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. ప్రతి వినతిని క్షుణ్ణంగా పరిశీలించి తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.