SKLM: రణస్థలం మండలం గిడిజాలపేట గ్రామంలో కోడి పందేల స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. కోడిపందాలు నిర్వహిస్తున్నారని సమాచారం రావడంతో జేఆర్‌పురం ఎస్సై చిరంజీవి తన సిబ్బందితో కలిసి శుక్రవారం సాయంత్రం కోడిపందేల స్థావరంపై దాడి చేశారు. ఈ దాడిలో 8 మందిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ.8,910 నగదు, 6కోళ్ళు, 4మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు.