NLR: వ్యాపార వాణిజ్య రంగాల ద్వారా ఆర్థిక స్వయం ప్రతిపత్తిని సాధించి మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు మెప్మా రిసోర్స్ పర్సన్ (ఆర్.పి) సిబ్బంది దోహదపడాలని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ నందన్ సూచించారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా మహిళలకు అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాల అమలుపై రెండు బృందాలకు శిక్షణ తరగతులను శనివారం నిర్వహించారు.