W.G: భీమవరంలో పలు పాల కేంద్రాలపై శుక్రవారం ఆహార భద్రత శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. శ్రీనివాస్ సెంటర్, డీఎన్ఆర్ కళాశాల రోడ్డులోని కేంద్రాల్లో నిల్వ ఉన్న పాలను పరిశీలించి, నమూనాలను సేకరించారు. ఆహార భద్రతాధికారి సుందరరామిరెడ్డి మాట్లాడుతూ.. సేకరించిన శాంపిల్స్‌ను పరీక్షల నిమిత్తం స్టేట్ ఫుడ్ సేఫ్టీ ల్యాబ్‌కు పంపినట్లు తెలిపారు.