E.G: పార్టీ కోసం శ్రమించే ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఇస్తామని వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా భరోసా ఇచ్చారు. కొవ్వూరులో గ్రామ, మండల కమిటీల సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.క్షేత్రస్థాయిలో కమిటీలను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యకర్తల సంక్షేమమే ధ్యేయంగా ప్రతి ఒక్కరికీ ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించనున్నట్లు ఆయన వెల్లడించారు.