6 Year Old Boy:భారీ వర్షాలు చిన్నారి అభిరామ్ (abhiram) ఇంట్లో విషాదం నింపింది. విజయవాడ గురునానక్ కాలనీలో ఉంటోన్న ఆ చిన్నారి ప్రమాదవశాత్తు డ్రైనేజీలో పడిపోయాడు. అతని కోసం స్థానికులు.. పోలీసులు, ఫైర్ సిబ్బంది తీవ్రంగా గాలించారు. కానీ నో యూజ్ ఆ చిన్నారి (children) విగతజీవిగా కనిపించాడు. తల్లిదండ్రులకు పుత్రశోకం మిగిల్చాడు.
కళ్ల ముందే చిన్నారి డ్రైన్లో పడిపోయాడని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. కాపాడలేకపోయామని కంట తడి పెట్టుకున్నారు. అభిరామ్ (abhiram) పడిపోయిన డ్రైనేజీకి పై కప్పు లేదు. ఇదీ శాపంగా మారింది. పేరంట్స్, స్థానికులు వెతికారు. పోలీసులను (police) సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన ఫలితం లేకుండా పోయింది.
డీఆర్ఎఫ్ సిబ్బందితో కలిసి బాలుడి (child) కోసం గాలింపు చర్యలు చేపట్టగా.. బాలుడి (child) మృతదేహాం కనిపించింది. డ్రైనేజీలకు పై కప్పు వేయాలని అధికారులను కోరామని స్థానికులు చెబుతున్నారు. కానీ తమ గోడును ఆలకించలేదని అన్నారు. అధికారుల నిర్లక్ష్యం ఓ నిండు జీవితాన్ని బలి తీసుకుంది. ఆ తల్లిదండ్రులకు (parents) పుత్రశోకం మిగిల్చింది. అల్లారుముద్దుగా ఆడుకునే చిన్నారి.. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.
చిన్నారి అభిరామ్ చనిపోగా.. అతని పేరంట్స్కు రూ.లక్ష ఆర్థిక సాయం అందజేస్తామని వీఎంసీ కమిషనర్ తెలిపారు. అలాగే దేవినేని ట్రస్ట్ ద్వారా రూ.50 వేలు ఇస్తామని దేవినేని అవినాష్ ప్రకటించారు.