VZM: రాజాం బాబానగర్ ఒకటో లైన్లో మురుగునీరు రోడ్డుపై ప్రవహించడంతో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక మురుగునీరు వల్ల దోమలు వ్యాప్తి చెందుతున్నాయని వాపోతున్నారు. చిన్నపాటి వర్షానికే రోడ్డు చెరువుల్ని తలపిస్తుంది ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.