ATP: కనేకల్కు చెందిన మహిళ శాంతి టైలరింగ్ నేర్చుకొని జీవనం సాగిస్తున్నారు. స్వయం ఉపాధిపై మక్కువతో తిరుమల స్వయం సహాయక సంఘంలో చేరి స్త్రీనిధి ద్వారా రూ.2 లక్షల రుణం తీసుకున్నారు. కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడింగ్ మిషన్ కొనుగోలు చేసి ప్రస్తుతం నెలకు రూ.25వేల ఆదాయం పొందుతూ ఇద్దరికి ఉపాధి కల్పిస్తున్నారు. మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.