AKP: కోటవురట్ల మండలంలో ఇందేశమ్మ ఘాట్ రోడ్డును హోంమంత్రి వంగలపూడి అనిత ఆదివారం పరిశీలించారు. రహదారి విస్తరణలో భాగంగా ఘాట్ రోడ్డును తొలగించి పనులు చేపట్టేందుకు ప్రభుత్వం రూ. 16 కోట్లు నిధులు మంజూరు చేసినట్లు ఆమె పేర్కొన్నారు. ఇక్కడ రహదారి విస్తరణ జరిగితే నర్సీపట్నం రేవు పోలవరం రోడ్డులో రహదారి సౌకర్యం మెరుగవుతుందన్నారు.