KRNL: నగరంలోని గార్గేయపురం చెరువులో దూకి భూపాల్నగర్కు చెందిన తిరుపతమ్మ (40) అనే వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. శుక్రవారం శ్రీరామ నవమి పూజల్లో పాల్గొన్న ఆమె అనంతరం కనిపించకుండా పోయింది. ఇవాళ చెరువులో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మానసిక స్థితి సరిగా లేకపోవడంతోనే ఈ ఘటన జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.