ASR: కాఫీకి గిట్టుబాటు ధర కల్పిస్తున్నాం కావున దళారులకు అమ్మి మోసపోవద్దు అని జీసీసీ ఛైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ రైతులకు సూచించారు. అనంతగిరి మండలం, ఎగువశోభ పంచాయితీ గ్రామాల్లో జిసీసీ ఛైర్మన్ పర్యటించి కాఫీ రైతులతో కాఫీ దిగుబడి పై మాట్లాడారు. కాఫీకు రూ.320, చెర్రీకి రూ.170, రోబెస్టాకు రూ.100లు మద్దతు ధరగా జీసీసీ చెల్లిస్తుందన్నారు.