ATP: కువైట్లో శనివారం నిర్వహించిన ప్రవాసాంధ్ర రెడ్డి సంఘం సమావేశానికి జిల్లా నేత, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆలూరు సాంబశివారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కులాలకు అతీతమైన నాయకత్వమే నిజమైన ప్రజాస్వామ్యమని ఆయన పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో సంక్షేమ పథకాలు వివక్ష లేకుండా ప్రతి పేదవాడికి అందాయని వివరించారు.