SKLM: పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష రాసే విద్యార్థుల కోసం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో ఉదయం 7 నుంచి 9 గంటల వరకు సహాయ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ కె. నారాయణరావు చెప్పారు. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. హాల్ టికెట్ సమస్యలపై సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశామని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.