VZM: దుప్పాడలో గల శ్రీ క్షేత్రంలో కొలువై ఉన్న అష్టలక్ష్మి సమేత ఐశ్వర్య వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కుడారై ఉత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా సాగింది. ధనుర్మాస సందర్భంగా దేవాలయం అర్చకులు సంయుక్తంగా వేదమంత్రాల నడుమ 108 గిన్నెలలో ప్రసాదాన్ని పెట్టి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు దుర్గా బాలాజీ, ఉమాదేవి దంపతులు, భక్తులు పాల్గొన్నారు.