KDP: పెండ్లిమర్రిలోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల నూతన ప్రిన్సిపల్‌గా రాజేశ్వరి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది ఆమెకు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. రాజేశ్వరి మాట్లాడుతూ.. కళాశాల అభివృద్ధికి, విద్యార్థుల విద్యా ప్రమాణాల పెంపునకు కృషి చేస్తానన్నారు. కళాశాల పురోగతికి అధ్యాపకులు,సిబ్బంది సహకారించాలని కోరారు.