అన్నమయ్య: నందలూరు మండలంలోని ఎర్ర చెరువుపల్లె ఉప సర్పంచ్ ఎన్నిక వాయిదా పడినట్లు ఈవోపీఆర్డీ సునీల్ కుమార్ తెలియజేశారు. ఈ సందర్భంగా గురువారం రాత్రి ఆయన మాట్లాడుతూ.. గ్రామ వార్డు మెంబర్లు హాజరు కాని కారణంగా ఈ ఎన్నిక వాయిదా పడిందన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తిరిగి ఎన్నిక జరిగే తేదీని ప్రకటిస్తారని ఆయన తెలిపారు.