E.G: రాజానగరం మండలం జనసేన పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ శనివారం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల వద్ద నుండి అర్జీలు స్వీకరించారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన జనసైనికులు, కూటమి నాయకులు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా సమస్యలను సంబంధిత అధికారుల దృష్టి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదేశించారు.