కోనసీమ: వివాహితపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ముగ్గురికి రాజమండ్రి కోర్టు జీవిత ఖైదు విధించినట్లు ఎస్పీ రాహుల్ మీనా వెల్లడించారు. ఉప్పలగుప్తం మండలం చల్లపల్లికి చెందిన 21 ఏళ్ల యువతిపై, ఓడలరేవు బీచ్ ప్రాంతంలో బొమ్మిడి వీరబాబు, కోపనాతి వెంకటేశ్వర్లు, మల్లాడి తాతారావు అఘాయిత్యానికి ఒడిగట్టారు. నేరం నిరూపితం కావడంతో న్యాయస్థానం ఈ కఠిన శిక్ష ఖరారు చేసింది.