NDL: మహానంది మండలం ఎంసీ ఫారం గ్రామ సమీపంలోని పాలేరు వాగు దగ్గర పంట పొలాల్లోకి చిరుత పులి శనివారం రాత్రి రోడ్డు దాటుకుని వెళ్లినట్లు ప్రయాణికులు తెలిపారు. కొందరు భక్తులు దర్శనం అనంతరం మహానంది నుంచి టూరిస్ట్ బస్సులో వెళ్తుండగా పాలేరు వాగు వద్ద రోడ్డు దాటి వెళ్లిందన్నారు. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు.