TPT: పేదలకు సేవలే లక్ష్యంగా పనిచేస్తున్న C.R ఫౌండేషన్‌కు గూడూరు సమీపంలో చావా వాసుదేవ రావు ఎకరా భూమిని విరాళంగా అందించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు కె. నారాయణ, అధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. సంస్థ అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గూడూరులో ఓల్డ్ ఏజ్ హోమ్ నిర్మాణం చేపడుతున్నట్లు వెల్లడించారు.