కృష్ణా: మచిలీపట్నంలోని కలెక్టరేట్లో జిల్లా అధికారులతో కలెక్టర్ బాలాజీ ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా జిల్లాలోని ముస్లిం సోదరులు ప్రార్ధనలు చేసుకునేందుకు వీలుగా వారు నివసించే ప్రాంతాలు, మసీదులలలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా మంచినీరు, విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేయాలని సూచించారు.