కృష్ణా: నందివాడ మండలం నందివాడ, గండేపూడి, గొంగళ్ళమూడి గ్రామాలలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలలో సహాయకురాళ్ల ఖాళీల భర్తీకి ఐసీడీఎస్ అధికారులు దరఖాస్తులను శనివారం ఆహ్వానించారు. పదో తరగతి ఉత్తీర్ణత కలిగి, 21 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు గల స్థానిక వివాహిత మహిళలు ఈ పోస్టులకు అర్హులని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.