VZM: ఏపీలో కూటమి ప్రభుత్వం రామతీర్థం అభివృద్ధిపై ప్రత్యకంగా దృష్టి సారించిందని నెల్లిమర్ల MLA లోకం నాగమాధవి తెలిపారు. సోమవారం రామతీర్థంలో పాత శ్రీరాముడి విగ్రహాల నిమజ్జనోత్సవ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌తో కలిసి పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. సనాతన ధర్మ పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, గత ప్రభుత్వంలో జరిగిన ఘటనపై సరైన న్యాయం జరగలేదన్నారు.