TPT: ఇంటి నుంచి పారిపోయి తిరుపతికి చేరుకున్న తెలంగాణ రాష్ట్రం ఘట్కేసర్కు చెందిన బాలుడు లావేటి సుజిత్ కుమార్ను అలిపిరి చెక్ పాయింట్ వద్ద టీటీడీ భద్రతా సిబ్బంది గుర్తించారు. అతని వివరాలను సేకరించి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఈ మేరకు బుధవారం సురక్షితంగా బాలుడిని అప్పగించారు. కుమారుడు దొరకడంతో కుటుంబ సభ్యులు టీటీడీ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.