GNTR: అమరావతి శాశ్వత రాజధానిగా నిలవడం గర్వకారణమని దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ అన్నారు. బుధవారం వింజనంపాడు ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. రాజధాని గురించి స్పష్టత వచ్చినందుకు ఆనందం వ్యక్తం చేశారు. సాంకేతిక అభివృద్ధిలో తెలుగు వారికి అవకాశాలు పెరుగుతున్నాయని చెప్పారు. యువత సోషల్ మీడియాను పరిమితంగా వినియోగించాలని సూచించారు.