VZM: జనవిజ్ఞాన వేదిక జిల్లా మహాసభను విజయవంతం చేయాలని జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు ఎరుకొండ ఆనంద్ విజ్ఞప్తి చేశారు. జిల్లా మహాసభల ఆహ్వాన పత్రికలను శుక్రవారం కంటోన్మెంట్ గురజాడ పాఠశాలలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు దశాబ్దాలుగా శాస్త్రీయ ఉద్యమం కోసం పనిచేస్తున్న జనవిజ్ఞాన వేదిక ప్రజలను శాస్త్ర విజ్ఞానం దిశగా నడిపిస్తుందన్నారు.