ASR: పండ్ల తోటల పెంపకంతో సుస్ధిర ఆదాయం వస్తుందని అరకు సర్కిల్ ఇన్స్‌స్పెక్టర్ ఎల్ హిమగిరి తెలిపారు. సోమవారం డుంబ్రిగుడ మండలం, లైగండ పంచాయితీ కేంద్రంలో గిరిజన రైతులకు ఐటీడీఏ సహాకారంతో సిల్వర్, నిమ్మ, సీతాఫల మొక్కలను పంపిణీ చేశారు. సీఐ మాట్లాడుతూ.. గంజాయి వంటి హానికరమైన నిషేధిత మొక్కలు కన్నా పండ్ల మొక్కలను పెంచడం వలన ఆదాయం, ఆహారం, సంఘంలో గౌరవం లభిస్తాయన్నారు.