VZM: విజయనగరం ట్రాఫిక్ పోలీసు స్టేషన్లో పని చేస్తున్న 80 మంది ట్రాఫిక్ పోలీసులకు దాతల సహకారంతో సమకూర్చిన బ్యాగ్, హ్యాట్, వాటర్ బాటిల్‌తో కూడిన సమ్మర్ కిట్స్‌ను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ట్రాఫిక్ పోలీసు స్టేషనులో నేడు (శనివారం) పంపిణీ చేసారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. మండు టెండలో ట్రాఫిక్ విధులు నిర్వహించడం చాలా కష్టంతో కూడుకున్న పని అన్నారు.