CTR: మిట్టూరు ప్రాంతంలోని ర్యాంకర్స్ స్కూల్లో శనివారం జరిగిన వార్షిక క్రీడోత్సవంలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నిత్యబాబు పాల్గొని విద్యార్థులకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించారు. సుమారు 400 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్న ఆయన,హెల్మెట్, సీటుబెల్ట్ వినియోగం తప్పనిసరి అని సూచించారు.