TPT: జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో మొత్తం 380 అర్జీలు స్వీకరించినట్లు కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. అర్జీలకు సకాలంలో నాణ్యమైన పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు, తదితరులు పాల్గొన్నారు.