VSP: రంజాన్ పండుగ సెలవులో మార్పు చేస్తూ జిల్లా విద్యాశాఖాధికారి (DEO) ప్రేమ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. క్యాలెండర్ ప్రకారం ఈరోజు ఉన్న సెలవును రద్దు చేసి, దానిని రేపటికి (శనివారం) మారుస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఈరోజు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు యధాతథంగా పనిచేస్తాయని, రేపు మాత్రం సెలవు ఉంటుందని స్పష్టం చేశారు.