అన్నమయ్య: మదనపల్లెలో ఇంటర్ ఫలితాల నేపథ్యంలో ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన గురువారం కలకలం రేపింది. కురబలకోట మండలానికి చెందిన MPC విద్యార్థిని 9 మార్కులు తక్కువ రావడంతో ఫెయిల్ అయి మనస్థాపంతో పురుగులమందు తాగింది. మరోవైపు ఇందిరానగర్‌కు చెందిన CEC విద్యార్థిని ఫెయిల్ కావడంతో నిద్ర మాత్రలు మింగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.