అన్నమయ్య: మదనపల్లిలో సోమవారం ఉదయం 10 గంటల నుంచి PGRS కార్యక్రమం నిర్వహించనున్నారు. జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఇంఛార్జ్ మంత్రితో P-4, బడ్జెట్ సమావేశాల్లో పాల్గొననున్న నేపథ్యంలో సంయుక్త కలెక్టర్ శివ నారాయణ శర్మ ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అర్జీల స్థితి తెలుసుకోవడానికి 1100 నంబర్‌ను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.