ATP: జిల్లాలో వ్యవసాయ పనుల కోసం డ్రోన్ల వినియోగం పెరుగుతోంది. ప్రస్తుతం రైతులకు అందుబాటులో 33 కిసాన్ డ్రోన్లు ఉన్నాయని అధికారులు తెలిపారు. ‘ఉబరైజేషన్ ఆఫ్ కిసాన్ డ్రోన్స్’ యాప్ ద్వారా రైతులు తమకు కావాల్సిన సమయానికి డ్రోన్లను బుక్ చేసుకోవచ్చు. తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో పురుగుమందుల పిచికారీ చేయడానికి ఇవి ఎంతో ఉపయోగపడుతున్నాయి.