VZM: రాజాం MLA కొండ్రు మురళీమోహన్ గురువారం స్దానిక TDP కార్యాలయంలో మునిసిపల్ కమీషనర్ రామచంద్రరావు ఆద్వర్యంలో జనగణన-2027లో భాగంగా సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. దేశాభివృద్ధికి జనాభా గణన అత్యంత కీలకమని పేర్కొన్నారు. ప్రజలు తమ ఇళ్ల స్దితిగతులు, వసతులు, ఇతర కుటుంబ వివరాలను ఎటువంటి భయం లేకుండా అధికారులకు ఖచ్చితంగా తెలియజేయాలని అన్నారు.