TPT: కలియుగ దైవం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పిస్తారు. వైకుంఠ ద్వార దర్శనాలు దృష్టిలో పెట్టుకొని అన్ని రకాల ప్రత్యేక దర్శనాలు రద్దు చేస్తున్నట్లు TTD ఛైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడించారు. టోకెన్లు కలిగిన భక్తులకు మాత్రమే స్వామివారి దర్శనాలకు అనుమతిస్తామని చెప్పారు.