విజయనగరం: వెనుకబడిన వర్గాల నాయకుడు, ప్రముఖ సామాజిక సంస్కర్త దొమ్మేటి వెంకట రెడ్డి 173వ జయంతి సందర్భంగా JNTU GVలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ వివి.సుబ్బారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దొమ్మేటి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఆయన జీవిత స్ఫూర్తిని విద్యార్థులు ఆచరణలో పెట్టాలని సూచించారు.