NLR: ముస్లిం మైనారిటీల సంక్షేమం కోసం సీఎం చంద్రబాబు బడ్జెట్లో రూ. 5,434 కోట్ల కేటాయించడం జరిగిందని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. ముస్లిం మైనారిటీల స్వయం ఉపాధి కోసం రూ. 173 కోట్లు కేటాయించారని తెలిపారు. మసీదుల ఇమామ్, మౌజనులకు వేతనాలు చెల్లిస్తున్నామని అన్నారు. రూ. 12 లక్షలతో షాది మంజిల్ ఆధునికరించడంతో ముస్లింలకు ఉపయోగపడుతుందని చెప్పుకొచ్చారు.