PLD: మాచర్లలో ఆర్యవైశ్య, యువజన, మహిళా సంఘాల నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఆదివారం ఘనంగా జరిగింది. అధ్యక్షుడిగా శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించారు. హాజరైన టీడీపీ నాయకుడు కేశవరెడ్డి మాట్లాడుతూ.. నూతన కమిటీ ఆధ్వర్యంలో సంఘం మరింత అభివృద్ధి ఆకాంక్షించారు. ఈ వేడుకలో ఆర్యవైశ్య ప్రముఖులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యవర్గాన శుభాకాంక్షలు తెలిపారు.