BPT: దివ్యాంగుల అవసరాలను కలెక్టర్ వినోద్ కుమార్ పట్టించుకోవడం లేదంటూ శుక్రవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో దివ్యాంగుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు గోగన ఆదిశేషు వినతిపత్రం అందజేశారు. దివ్యాంగులకు ఉపకరణాలు ఇవ్వాలని, ప్రభుత్వ కార్యాలయాల్లో ర్యాంపులు ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే, మున్సిపాలిటీ షాపింగ్ కాంప్లెక్స్‌లలో 5% రిజర్వేషన్ కల్పించాలని కోరారు.