KDP: కడప భాకరాపేట రహదారి రైల్వే గేట్ సమీపంలో సోమవారం రాత్రి జరిగిన ప్రమాదంలో ప్రొద్దుటూరుకు చెందిన శంకర్ (37) మృతి చెందారు. గూడ్స్ రైలు కింద పడటంతో తల, ముఖానికి తీవ్ర గాయాలైన ఆయనను పోలీసులు కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శంకర్ ఇవాళ మృతి చెందినట్లు రైల్వే ఎస్సై సునీల్ కుమార్ రెడ్డి తెలిపారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.