ATP: గుంతకల్లు మున్సిపాలిటీలోని గంగానగర్ వద్ద తాగునీటి ట్యాంక్ వాల్ రిపేర్ కారణంగా తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కాగా ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఆదేశాలతో సోమవారం 14వ వార్డు ఇన్చార్జ్ పద్మావతి ఆధ్వర్యంలో కాలనీలో తాగునీటి ట్యాంకర్లతో నీటిని సరఫరా చేశారు. దీంతో కాలనీవాసులు తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.