TPT: తిరుపతి, సూళ్లూరుపేట ప్రాంతాల్లో నమోదైన అక్రమ కేసులపై ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి చేసిన వారిని వదిలి బాధితులపైనే కేసులు నమోదు చేసి అరెస్టు చేయడం అన్యాయమని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యపై కేసు నమోదు, వైసీపీ నాయకుల అరెస్టు దుర్మార్గమని పేర్కొన్నారు. అక్రమ కేసులను ఉపేక్షించబోమని ఉద్ఘాటించారు.