SKLM: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా మహిళలకు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ శుభాకాంక్షలు తెలిపారు. గత 25 ఏళ్లలో జిల్లాలో 5.36 లక్షల మంది మహిళలు ఆర్థికంగా ఎదిగారని ,10,458 మంది మహిళలు వ్యాపార వేత్తలుగా మారారని శనివారం తెలిపారు. మహిళలు నిర్వహిస్తున్న చిన్న ఆహార శుద్ధి పరిశ్రమలకు రూ.8.49 కోట్ల సీడ్ క్యాపిటల్ నిధులు అందించామని తెలిపారు.