W.G: పాలకొల్లు శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి దేవస్థానంలో మంగళవారం హుండీలు తెరిచి లెక్కించారు. 105 రోజులకు రూ.18,97,247 ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమం క్షీరపుర అన్నదాన సమాజం కార్యనిర్వహణాధికారి ఎన్.రంగరాజన్, సలాది వారి సత్రం కార్యనిర్వహణాధికారిని వీ. నాగ జ్యోతి, చినగోపురం కార్యనిర్వహణాధికారి శంకర్ల పర్యవేక్షణలో ఈవో ముచ్చర్ల శ్రీనివాస్ నిర్వహించారు.