VZM: గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ మాస్టర్స్ అథ్లెటిక్స్ 2024-25 సంబంధించిన టోర్నమెంట్లో శనివారం విజయనగరం వాసులు మెరిశారు. జిల్లా విద్యుత్ శాఖలో సర్కిల్ పరిధిలో జూనియర్ అసిస్టెంట్ పి. అనిల్ కుమార్ 200మీ. పరుగుపందెంలో బంగారు పతకం, పోలుపల్లి పైడిరాజు లాంగ్ జంప్‌లో కాంస్య పతకం సాధించారు. దీంతో వారిని అధికారులు, సహా ఉద్యోగులు అభినందించారు.