విశాఖ: ఏప్రిల్ 20న జరగనున్న సింహాచలం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వార్షిక చందనోత్సవంపై జిల్లా ఇంఛార్జి మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మంగళవారం కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా పక్కా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్, సీపీ శంఖబ్రత బాగ్చిలను ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ గణబాబు పాల్గొన్నారు.