SKLM: ఏపీ ఎస్టీ కమిషన్ ఛైర్మన్ ఎస్. బొజ్జి రెడ్డి శ్రీకూర్మం క్షేత్రంలోని శ్రీ కూర్మనాథ స్వామిని సోమవారం దర్శించుకున్నారు. ఆలయాల వద్దకు చేరుకున్న ఆయనకు అర్చకులు, అధికారులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు.