VSP: నగరంలోని మానసిక వైద్యశాలలో రూ.30 కోట్లతో నిర్మించిన భవనాలను ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మంగళవారం ప్రారంభించారు. ఆసుపత్రి ప్రాంగణాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. ఆయనతో పాటు ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, వెలగపూడి రామకృష్ణబాబు, ఎంపీ శ్రీభరత్, కలెక్టర్ ఎంఎన్ హరేంద్రప్రసాద్, ఇతర వైద్యాధికారులు ఉన్నారు. వైద్యసేవల విషయంలో ప్రభుత్వం రాజీ పడదన్నారు.